telugu navyamedia
రాజకీయ వార్తలు

వచ్చే ఏడాది జూన్ వరకు ఉచిత రేషన్: మమత

mamatha benerji

దేశంలోని 80 కోట్ల మందికి నవంబర్ నెల వరకు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ చేసిన ప్రకటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దీవా చేశారు. నవంబర్ వరకే ఫ్రీ రేషన్ ఇస్తున్నట్టు మోదీ ప్రకటించారని తెలిపారు.

తాము వచ్చే ఏడాది జూన్ వరకు రేషన్ సరుకులను ఉచితంగా ఇవ్వబోతున్నామని మమత చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సరుకుల క్వాలిటీ కంటే తాము ఇచ్చే సరుకుల నాణ్యత మెరుగ్గా ఉందని అన్నారు. పశ్చిమబెంగాల్ లో కేవలం 60 శాతం మంది ప్రజలకు మాత్రమే కేంద్ర రేషన్ అందుతోందని ఆమె అన్నారు.

Related posts