telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

పవన్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్..ఇంటి నుంచే డబ్బింగ్!

pawan

లాక్ డౌన్ నేపథ్యంలో పవర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారు. ఆయన నటిస్తోన్న ‘వ‌కీల్‌సాబ్‌’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగులు నిలిచిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు పూర్త‌యిన సినిమా ఎడిటింగ్ చూస్తోన్న పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమాలో డ‌బ్బింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను టాలీవుడ్‌లో పవన్ పోషిస్తున్నారు. హిందీలో తాప్సి నటించిన పాత్రలో తెలుగులో నివేదా థామస్ నటిస్తోంది. ఈ సినిమాను మే 15న విడుద‌ల చేస్తామని ఇప్పటికే ఆ సినిమా బృందం ప్రకటించింది. 

Related posts