telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను రూల్స్ చాలా కట్టుదిట్టంగా పాటిస్తున్నాను… ఈ గార్డెన్ మాదే… : సోనమ్ కపూర్

Sonam-Kapoor

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత బాలీవుడ్ ఒక్కసారిగా నెపోటిజంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ కిడ్స్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్‌గా సోనమ్ కపూర్ ఒక గార్డెన్‌లో కూర్చున్న ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోని చూపిస్తూ.. ఇండియా నుంచి లండన్ వెళ్లిన ఆమె క్వారంటైన్ రూల్ బ్రేక్ చేసిందని, ఆమెను అరెస్ట్ చేయాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి సోనమ్ కపూర్ గట్టిగానే కౌంటర్ వేసింది. నేను క్వారంటైన్ రూల్ బ్రేక్ చేయలేదు. నేను రూల్స్ చాలా కట్టుదిట్టంగా పాటిస్తున్నాను. నేను ఉన్న గార్డెన్ మా సొంతది. మేము ఉండే ఇంటికి ఆ గార్డెన్ అటాచ్ అయి ఉంటుంది. ప్రజలకు చాలా సమయం ఉంది. వదిలేయండి”. అంటూ నెటిజన్ ట్వీట్‌కు సోనమ్ సమాధానమిచ్చింది. అయితే ఇకపై ట్రోలింగ్ ను సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటామని, టాలెంట్ ఉంటేనే తప్ప.. బంధుప్రీతి ఇక్కడ పనిచేయదని, ఇక అలాంటి మాటలు మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు స్టార్ కిడ్స్.

 

View this post on Instagram

 

No filter, just amazing natural light ☀️ also chirping birds make me 😊

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

Related posts