telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తలైవి : 20 కేజీల బరువు పెరిగిన కంగనా… వెన్ను భాగం దెబ్బతిందట

Thalaivi

కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తున్న “త‌లైవీ” చిత్రం. లాక్ డౌన్ కారణముగా దాదాపు ఆరు నెలలు షూటింగ్ కు దూరమైన కంగనా ఇటీవలే షూటింగ్ స్పాట్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో జయలలితలా కనిపించేందుకు కంగన ఏకంగా 20 కేజీల బరువు పెరిగిందట. అంత బరువుతో భరతనాట్యం చేయడం వల్ల ఆమె వెన్ను భాగం దెబ్బతిందట. సినిమా కోసం పెరిగిన బరువును తగ్గించుకోవడానికి కంగన చాలా కష్టపడిందట. తన సాధారణ బరువుకు వచ్చేందుకు ఏడు నెలల సమయం సరిపోలేదట. ఈ విషయాలను తెలియజేస్తూ కంగన చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ రాశారు. ‘తలైవి’ బయోపిక్‌ను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో అర‌వింద‌స్వామి దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి, లెజెండరీ యాక్టర్‌ ఎంజీ రామ‌చంద్రన్ (ఎంజీఆర్‌) పాత్రలో న‌టిస్తున్నారు. అలాగే మ‌రో లెజెండ్రీ పొలిటీషియ‌న్, దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్రలో విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. బ్లేడ్ ర‌న్నర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు. దర్శకుడు విజయ్ శోభన్ బాబు పాత్రకు ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తాను ఎంపిక చేసారు.

Related posts