telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాకలో 35 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తాం..

దుబ్బాకలో గెలుపు టీఆర్ఎస్ పార్టీ దేనని…35 వేలకు మెజారిటీ తగ్గదు తలసాని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేసారు. బీసీలకు సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న విదంగా ఎక్కడ ఇవ్వడం లేదు అని పేర్కొన్నారు. ఏ ఎన్నిక అయినా బీసీలకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వళ్ళించినట్లు ఉంటది అని తెలిపారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గాంధీ భవన్ ముందు జరిగిన ధర్నాలను ఎవ్వరూ మర్చిపోలేదు అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వర్గాలకు తప్ప బీసీలకు ప్రియారిటీ ఇచ్చిన దాఖలాలు లేవు అని పేర్కొన్నారు. దుబ్బాకలో ప్రతిపక్షాలు చేసిన హంగామా ఇంతా అంతా కాదు! రేపు 10వ తేదీన ఫలితాలను ప్రజలు చూడాలి. తెలంగాణ లో భారీ వర్షాలు కురిస్తే కేంద్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. నరేంద్రమోదీ దేశానికి ప్రధానమంత్రి నా? బీహార్ కి ప్రధానమంత్రి నా? అని తలసాని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడుతారు కానీ—కేంద్రం రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి మాట్లాడలేదు. వచ్చే GHMC ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులు ఉన్నారా? అని అడిగారు.

Related posts