telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్

acb telangana

నిజామాబాద్ రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.1500 లంచం తీసుకుంటుండగా ఇంఛార్జ్ సబ్‌రిజిస్ట్రార్ శ్రీధర్‌ ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు 1500 డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

డబ్బుల వసూళ్లకు సంతోష్ అనే వ్యక్తిని సబ్‌రిజిస్ట్రార్ నియమించుకున్నట్లు అధికారులు గుర్తించారు. దస్తావేజులేకరి కృష్ణ ప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిజామాబాద్ రూరల్ ఇంఛార్జ్ సబ్‌రిజిస్ట్రార్ శ్రీధర్‌, ఏజెంట్ సంతోష్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ శుక్రవారం చేశారు.

Related posts