telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

డిజిటలైజెషన్ వచ్చినా.. బ్యాంకుకు సెలవు అంటే.. భయపడుతున్న వినియోగదారులు…

10 days bank holidays in april

దేశంలో ఎంత డిజిటలైజెషన్ వచ్చినా బ్యాంకు కు సెలవలు వస్తే, వినియోగదారులు భయపడిపోతున్నారు. కారణం ఇప్పటికి కూడా బ్యాంక్ ఉద్యోగులకు సెలవు కారణంగా లక్షల మందిపై ప్రత్యక్షంగానే ప్రభావం పడుతుంది. అందుకే బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే చూసుకుంటుంటారు కొందరు. ప్రస్తుతం రోజుల్లో డబ్బులేనిదే ఏ పని జరగదు. తెల్లారితే డబ్బులు ఎవరికైనా అవసరముంటుంది. బిజినెస్ వ్యవహారాలు ఉన్నవారికి మరింత కష్టం ఎప్పుడూ డిపాజిట్‌లో, డీడీలు అంటూ బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పని ఉంటుంది. దాంతో వాళ్ళు బ్యాంక్ సెలవులను ముందుగానే గ్రహించాల్సి వస్తుంది.

ఈ క్రమంలోనే డిసెంబర్ లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 14, 28 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే డిసెంబర్ నెలలో వచ్చే ఐదు ఆదివారాలు 1, 8, 15, 22, 29 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు సెలవు. ఈ సెలవలు కాకుండా ఉద్యోగులకు మరో రెండు రోజులు సెలవలు క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్‌25న సెలవు ఉంటుంది. ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లకు ఆటంకమేమి లేదు. ఆన్‌లైన్‌, డిజిటల్ వంటివి యధావిధిగానే కొనసాగుతాయి.

Related posts