వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, పుల్వామా దాడుల నేపథ్యంలో పాక్ సైనికులకు చిక్కి అనేక బాధలు ఎదుర్కొని తిరిగి సురక్షితంగా భారత గడ్డపై అడుగుపెట్టిన హీరో. ఆయన తిరిగి నేడు విధుల్లో చేరారు. నాలుగు వారాల పాటు సెలవులో ఉన్నా అభినందన్ చెన్నైకి వెళ్లలేదు. లీవ్ సమయంలో శ్రీనగర్‌లోనే అతనున్నాడు.
సెలవు పూర్తి కావడంతో..శ్రీనగర్ స్క్వాడ్రన్‌లో ఇవాళ చేరాడు. పాక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సుమారు రెండు వారాల పాటు ఆయనను భద్రతా దళాలు ప్రశ్నించాయి. ఆ తర్వాత 12 రోజుల పాటు సెలవు తీసుకున్నాడు. అయితే అభి మళ్లీ ఫైటర్ విమానాన్ని నడపాలా వద్దా అన్న అంశాన్ని మెడికల్ బోర్డు నిర్ణయిస్తుందని అధికారులు చెప్పారు.