telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ పేమెంట్ సినిమాలకు ఇచ్చిన దాని కంటే ఎక్కువే : హిమజ

Himaja

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ హిమజ బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు తనకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె అన్నారు. సినిమాలకు ఇచ్చిన దాని కంటే ఎక్కువ పేమెంటే బిగ్ బాస్ వాళ్లు ఇచ్చారని చెప్పారు. బిగ్ బాస్‌ షోలో వారానికి ఇంతని రెమ్యునరేషన్ ఉంటుందన్నారు. అక్కడ తనకు ఇచ్చిన రెమ్యునరేషన్‌తోనే కొత్త ఇల్లు కొన్నానని స్పష్టం చేశారు. అయితే, ఆ మొత్తం ఎంత అనే విషయం మాత్రం హిమజ చెప్పలేదు. బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త సీజన్ ప్రారంభమైన ప్రతిసారీ రెమ్యునరేషన్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఈ సీజన్‌లో ఏ కంటెస్టెంట్‌ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అసలు వీళ్ల రెమ్యునరేషన్ ఎంత? అనే విషయాలపై చర్చ ఎక్కువగా జరుగుతుంది. బయట వినిపించేవి అన్నీ వదంతులే కానీ అసలు వాళ్లకు ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో ఎవ్వరికీ కరెక్ట్‌గా తెలీదు. ఈ నేపథ్యంలో తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు సీజన్ 3 కంటెస్టెంట్, నటి హిమజ. కాగా ప్రస్తుతం హిమజ ‘జ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. హిమ‌జ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ‌జై దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై గోవ‌ర్థన్ రెడ్డి కందుకూరి నిర్మించారు. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. హిమ‌జ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నవంబర్ 2న ప్రముఖ సింగ‌ర్, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ‘జ’ మూవీ ఫ‌స్ట్‌లుక్, టైటిల్ లోగోను విడుద‌ల ‌చేశారు.

Related posts