telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ చరణ్, మంచు మనోజ్ లతో ‘బిల్లా రంగా’ రీమేక్ …

billa-ranga

రామ్ చరణ్, మంచు మనోజ్ చిన్నప్పటి నుంచీ స్నేహితులన్న విషయం తెలిసిందే. తాజాగా.. టాలీవుడ్‌లోకి మనోజ్ ‘అహాం బ్రహ్మాస్మి’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టాడు రామ్ చరణ్. అయితే తాజాగా వీళ్లిద్దరు ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందట. అప్పట్లో చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘బిల్లా రంగా’ సినిమాను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనున్నట్టు సమాచారం. బిల్లా రంగాలో.. చిరు, మోహన్‌ బాబులు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాని కేయస్ఆర్‌దాస్ దర్శకత్వం వహించగా.. పింజల నాగేశ్వర రావు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు అప్పటివరకూ ఉన్న యాక్షన్‌ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రంలో.. చరణ్, మనోజ్‌లు వాళ్ల తండ్రుల పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Related posts