బిగ్ బాస్ బ్యూటీ, కోలీవుడ్ నటి ఓవియా బిగ్‌బాస్ ఫేం, నటుడు ఆరవ్‌తో ప్రేమలో పడినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి బిగ్‌బాస్ షో హౌస్‌లో హడావుడి సృష్టించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ చాలా క్లోజ్‌గా వుంటున్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే తాము మంచి ఫ్రెండ్స్ తప్ప మరేమిలేదని వారు కొట్టిపారేస్తున్నారు. కాని కొన్ని ప్రైవేట్ పార్టీలకు ఇద్దరూ కలిసి వెళ్లడంతో ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓవియా తన 29వ జన్మదినాన్ని రెండు రోజుల క్రితం సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో ఆరవ్ కూడా పాల్గొని కేక్ కట్‌చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్న ఫోటోలన్నీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో కోలీవుడ్ లో మరోసారి వీరి ప్రేమ గురించిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
previous post