బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కొన్నాళ్ళుగా మ్యూజిషియన్ మిశాల్ కిర్పలానితో డేటింగ్‌లో ఉన్నారన్న విషయం తెలిసిందే. వీరిద్దరి ప్రేమాయణం గురించి కొన్నాళ్ళుగా మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్‌మీ ఎనీథింగ్ సెషన్‌లో పాల్గొన్న ఇరా ఖాన్ కు ఓ నెటిజన్ నుంచి “మీరు ఎవరితోనైన డేటింగ్‌లో ఉన్నారా?” అనే ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా ఇరాఖాన్ తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది. మిశాల్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలని షేర్ చేసిన ఇరా “ఇప్పటికైన నా మనసులో విషయం మీకు అర్ధమైందనుకుంటా” అని కామెంట్ పెట్టింది. దీంతో అందరు ఇరా, మిశాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు. అమీర్ తనయుడు జునైద్‌కి నటనలో ఆసక్తి ఉండగా, ఇరాకి మాత్రం నిర్మాణ రంగంపై ఆసక్తి ఉందని అమీర్ ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
previous post
next post

