ప్రముఖ బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ దగ్గర ఎన్నో ఏళ్లుగా అసిస్టెంట్ గా పని చేసిన అమోస్ (60) గుండెపోటుతో ముంబైలో ఇవాళ మృతి చెందారు. దాదాపు ఇరవై ఐదేళ్లు తన వద్ద అసిస్టెంట్ గా పని చేసిన అమోస్ మృతితో అమీర్ ఖాన్ దంపతులు విషాదంలో మునిగిపోయారు. గుండెపోటుకు గురైన అమోస్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లింది అమీర్ దంపతులే. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. ముంబైలో ఇవాళ నిర్వహించిన అమోస్ అంత్యక్రియలకు అమీర్ ఖాన్, భార్య కిరణ్ రావు హాజరయ్యారు. కాగా, అమోస్ కుటుంబసభ్యులను పరామర్శించి.. ఓదార్చారు. అమోస్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.