వాంఖడే మైదానంలో నిన్న జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ 4 రన్స్ తేడాతో రాజస్థాన్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ పూర్తవ్వడానికి దాదాపు అటు ఇటుగా అర్ధరాత్రి 12 అయింది. దాంతో మ్యాచ్‌కు ఆలస్యంగా ముగియడానికి కారణమైన ఇరు జట్ల కెప్టెన్లపై జరిమానా విధించాలని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. అయితే ఇదే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌కు కారణమైన చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీపై రూ.12 లక్షల జరిమానా పడిన విషయం తెలిసిందే. అయితే తాజా మ్యాచ్ కూడా నిర్ణీత సమయంలో ముగియలేదని, దానికి బాధ్యులైన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, రాజస్థాన్ సారథి సంజూ శాంసన్‌లపై జరిమానా విధించాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘ఇరు జట్లు గంటకు 10 ఓవర్లు మాత్రమే వేసాయి. ఈ మ్యాచ్‌లో ఎక్కువగా సిక్సర్లు నమోదయ్యాయి, అలాగే మ్యాచ్ చాలా టైట్‌గా సాగింది. కాదనలేను. కానీ ఓ టీ20 ఇన్నింగ్స్ ముగియడానికి రెండు గంటలు పట్టడం ఏ మాత్రం మంచిది కాదు. గత మ్యాచ్‌లో ధోనీపై జరిమానా విధించారు. ఈ మ్యాచ్ విషయంలో కూడా ఇరు జట్లకు జరిమానా పడుతుందునుకుంటున్నా.’అని చోప్రా అన్నాడు.
మన్కడింగ్ పై హర్షా భోగ్లే కీలక వ్యాఖ్యలు…