telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

వివేకానంద జయంతి రోజున నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు.

స్వామి వివేకానంద గారి ఆదర్శాలను అలవర్చుకుని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావం పెంపొందించడంలో స్వామి వివేకానంద బోధనలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

దేశ భవిష్యత్తును నిర్మించే యువతకు ఆయన ఆలోచనలు నిరంతర ప్రేరణగా ఉంటాయని పేర్కొంటూ, స్వామి వివేకానంద జీవితం, వారి సందేశాలు నేటి సమాజానికి అత్యంత అవసరమని తెలిపారు.

స్వామి వివేకానంద ఉన్నత ఆలోచనలను కేవలం స్మరించడమే కాకుండా, వాటిని మన దైనందిన జీవితాల్లో ఆచరణలో పెట్టినప్పుడే వారికి మనం అర్పించే నిజమైన నివాళి అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Related posts