అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో 15 మంది అధికారులతో సోదాలు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు.
అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపైనే తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం, సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తింపు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజీవ్.. అగ్రి గోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఉదయం 5 గంటల నుంచి జోగి రమేష్ ఇంట్లో జరుగుతున్న తనిఖీలు.