telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మ్యాట్రిమోని పేరుతో లేడీ ఘరానా మోసాలు..

తెలుగు మ్యాట్రిమోని సైట్ లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి మోసానికి పాల్పడిన ఘరానా లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన బండి లావణ్య అనే యువతిని అరెస్ట్ చేసారు ఎల్బీనగర్ పోలీసులు. లావణ్య నారాయణ స్కూల్ లో ప్రైవేటు టీచర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. శాన్వి కృతిక పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి వల వేస్తున్న నిందితురాలు లావణ్య…పలువురుని బుట్టలో వేసుకొని పెళ్లి పేరుతో డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. తమ బంధువు కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని… తనకు డబ్బులు కావాలి అంటూ చెప్పి ఓ యువకుడిని మోసం చేసింది. అయితే.. మోసపోయామని తెలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పలుగురు భాదితులు. నిందితురాలను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. ఈ లేడి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.

Related posts