telugu navyamedia
తెలంగాణ వార్తలు

వైద్యుల నిర్ల‌క్ష్యంతో నాలుగు నెల‌ల చిన్నారి మృతి

హైద‌రాబాద్.. కుషాయిగూడలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో బుధ‌వారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్ల‌క్ష్యంతో ఓ నాలుగు నెల‌ల చిన్నారి మృతి చెందింది. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారి వంశిక‌ను, ఆమె కుటుంబ స‌భ్యులు చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రిలో చేర్పించారు. చికిత్స కోసం కుటుంబ స‌భ్యుల నుంచి ఆస్ప‌త్రి యాజ‌మాన్యం రూ. ల‌క్ష వ‌సూలు చేసింది.

కానీ చికిత్స చేయ‌డంలో ఆస్ప‌త్రి వైద్యులు నిర్ల‌క్ష్యం వ‌హించారు. దీంతో ఆ ప‌సిపాప బుధ‌వారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే త‌మ బిడ్డ చ‌నిపోయింద‌ని త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Related posts