telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మేము రోడ్డున పడ్డాం.. తాత్కాలిక ఉద్యోగుల ఆవేదన

metro slashed RTC in hyderabad

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 52 రోజుల సమ్మె అనంతరం తిరిగి ఈ రోజు విధుల్లో చేరడంతో బస్సులు రోడ్డెక్కాయి. దీంతో సమ్మెకాలంలో విధులు నిర్వహించిన తాత్కాలిక ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కార్మికులు సమ్మెకు దిగడంతో దాదాపు రెండు నెలలపాటు వీరు విధులు నిర్వహించి ప్రత్యామ్నాయ రవాణాకు సహకరించారు. రెగ్యులర్ ఉద్యోగులు రావడంతో ప్రస్తుతం సంస్థకు వీరి అవసరం లేకుండా పోయింది. దీంతో తమ పరిస్థితి ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. జీడిమెట్ల బస్సు డిపో వద్ద తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఈ రోజు ఉదయం తమ ఆవేదన వ్యక్తం చేశారు.

సమ్మెకాలంలో ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేశామని అంటున్నారు. కానీ ఇన్నేళ్లు సేవలందించి ఇప్పుడు మేము రోడ్డు పై అసహాయతతో నిల్చున్నాం. ముఖ్యమం త్రి కేసీఆర్ మాపట్ల కూడా సానుభూతి చూపి ఏదో ఒక దారి చూపించాలి’ అంటూ వీరు వేడుకుంటున్నారు. భవిష్యత్తులో ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ సమయంలోనైనా తమ సేవలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యం ఇస్తే సంతోషిస్తామని తెలిపారు.

Related posts