కౌంటింగ్ ఏజెంట్ల సమావేశం లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తెదేపా నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.
వైకాపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.
“పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు. కానీ రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్గా వద్దు” అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.


పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్ పై విచారణ చేపట్టాలి: చంద్రబాబు డిమాండ్