telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కదిరి సౌర విద్యుత్ సంస్థ .. దందాల ఊబిలోకి వెళ్తుందా.. !!

commission process in kadiri solar plant

కదిరిలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభం అయిన సౌర విద్యుత్ కేంద్రంలో రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం మారేసరికి అక్కడ సంస్థను ఏర్పాటు చేసిన యాజమాన్యానికి తలనొప్పులు తప్పడంలేదు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినది కాబట్టి వారికి చదివింపులు అయిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇంతలో ప్రభుత్వం మారిపోవడంతో, వీరికి కూడా కమిషన్లు ఇవ్వాలంటూ ఆ పార్టీ వర్గాలు సంస్థ వద్దకు వచ్చి పోలీసుల ముందే హల్ చల్ చేసినట్టు సామాజికమాద్యమాలలో స్పష్టంగా ప్రచారం సాగుతుంది.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థలకు ప్రధమాంకంలో ఇటువంటివి తప్పకపోయినా, వెంటనే ప్రభుత్వాలు మారటం మాత్రం పెద్ద తలనొప్పే అని చెప్పాలి. దాదాపు రెండు ప్రభుత్వాల మధ్య ఇరుకున్నట్టుగానే ఉంటుంది. తమ ఊరిలో ఏదో సంస్థ ఏర్పాటు చేస్తున్నారు, తమకు ఉపాధి లభిస్తుంది అని ఆశిస్తున్న అక్కడి ప్రజల ఆశలు కూడా ఈ ప్రభుత్వ, సంస్థల పెనుగులాటలో ఆవిరైపోతున్నాయంటే అతిశయోక్తి కాదు.

ఈ కమిషన్ల దందా ప్రతి పారిశ్రామిక వాడ అనుభవించిందే అయినప్పటికీ, ఇప్పటి ఏపీలో ఇలాంటివి కొనసాగటం ఆ రాష్ట్ర భవిష్యత్తుకు ససేమిరా మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts