కరోనా కల్లోల సమయంలో దేశవ్యాప్తంగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేరు మారుమ్రోగిపోయింది. వలస కార్మికులకు ఆపన్నహస్తం అందించడంతో సహా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలతో పాటు ప్రముఖుల మన్నననలు అందుకున్నారు సోనూసూద్. పలు సమస్యలపై దృష్టి సారించి తన వంతు సహాయం చేయడానికి సోనూ ముందుకొస్తున్నాడు. దీంతో కొందరు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను సోనూకు విన్నవించుకుని సహాయం అడుగుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఫన్నీ ట్వీట్లు కూడా చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించమని సోనూను కోరాడు. త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించమని అడిగాడు. దీనికి స్పందించిన సోనూ `బస్సు, రైలు, విమానం టికెట్లు తప్ప వేరే టికెట్లు ఇప్పించడం తెలియదు బ్రదర్` అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
बस, ट्रेन और प्लेन की टिकट के इलावा मुझे कोई टिकट दिलवाना नहीं आता मेरे भाई। 😂🙏 https://t.co/qULDxegoLW
— sonu sood (@SonuSood) September 16, 2020


ఆంధ్రప్రదేశ్ ఏమన్నా నార్త్ కొరియానా ?… వర్మ వ్యాఖ్యలు