telugu navyamedia
రాజకీయ వార్తలు

కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం!

parliament india

సెంట్రల్ విస్తా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ భావన నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు మొత్తం ఏడు సంస్థలు పోటీపడగా చివరికి రూ. 861.90 కోట్లకు బిడ్ దాఖలు చేసిన టాటా ప్రాజెక్ట్స్‌కు ఇది దక్కింది.

లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) రూ. 865 కోట్లకు కోట్ చేసింది. ఫలితంగా తక్కువ ధరకు కోట్ చేసిన టాటాకు ఇది దక్కింది.నిర్మాణ పనులు దక్కించుకున్న టాటా 21 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ముందే దీనిని ప్రారంభించాలని కేంద్రం గట్టి పట్టుదలగా ఉంది.

పార్లమెంటుకు సమీపంలో 118 ప్లాటులో నిర్మించనున్న దీని ఆకృతి త్రికోణాకారంలో ఉండనుంది. ఎంపీల సీట్లు పెరిగే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా అత్యంత విశాలంగా దీనిని నిర్మించనున్నారు. 1400 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం ఉంటుందని కేంద్ర ప్రజా పనుల విభాగం పేర్కొంది.

Related posts