telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రేపే బిహార్‌ ఎన్నికల ఫలితాలు .. లాలూ ఆరోగ్యం సిరీయస్‌

రేపే బీహార్‌ ఫలితాలు వెలువడనున్నాయి. బీహార్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.. అయితే… ఇప్పటికే అన్ని సర్వేలు తేజస్వ్‌ యాదవ్‌ సీఎం పీఠం ఎక్కుతాడని చెప్పేశాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం మరింత క్షిణించింది. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్లే చెప్పారు. రేపు బీహార్‌ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. లాలూ ప్రసాద్‌కు డయాలసిస్‌ కొనసాగుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం లాలూ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ 2017 నుంచి జైలులో ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన దీర్ఘకాలిక మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నారని.. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆయనకు డయాలసిస్‌ చేయాల్సిన అవసరం రాలేదని వైద్యులు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్‌ చేస్తున్నట్టు రిమ్స్‌ వైద్యులు వెల్లడించారు.

Related posts