telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలవరం నిధులపై మోదీకి జగన్ లేఖ

cm jagan ycp

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను విడుదల చేయాలని ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పనుల కోసం ఈ ఏడాది జూన్‌ వరకు రూ.12,312.88 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. ఇందులో రూ.8,507.26 కోట్లను పీపీఏ ద్వారా కేంద్రం రీయింబర్స్‌ చేసిందని పేర్కొన్నారు. మిగిలిన రూ.3,805.62 కోట్లను తక్షణమే రియింబర్స్ చేయాలని కోరారు.

పోలవరం పనులకు రూ. 15 వేల కోట్లు అవసరమని జగన్ తెలిపారు. విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరంను కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చిందని చెప్పారు. ప్రాజెక్టు పనులు 33.23 శాతం పూర్తయ్యాయని తెలిపారు.

Related posts