telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈసారి వినాయక చవితి ఇంట్లోనే.. అవన్నీ బంద్… పోలిసుల కీలక నిర్ణయం

Vinayakudu

వినాయ‌క‌ చ‌వితి ఉత్సవాలు మొదలయ్యాయంటే హైదరాబాద్ నగరం మొత్తం కొత్త కళ సంతరించుకుంటుంది. ఇంట్లో, గ‌ల్లీలో, వీధిలో, కాల‌నీలో, ఏరియాలో, యూత్ కొక‌టి… ఇలా ఎన్నో గ‌ణేష్ మండ‌పాల‌ను ఏర్పాటు చేసిన భ‌జ‌న‌ల్లో మునిగిపోతారు. తొమ్మిది రోజులు పూజలు, తరువాత తరువాత లడ్డు వేలంపాట, ఊరేగింపు, ఇక నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం… దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంద‌రి చూపు హైద‌రాబాద్‌పైనే ఉంటుంది. ప్రస్తుతం క‌రోనా నేప‌థ్యంలో హైద‌రాబాద్ పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఓ వైపు గ‌ణేష్ చ‌వితి, మ‌రోవైపు మొహ‌రం రానుండగా సోష‌ల్ మీడియా వేదిక‌గా కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్… కరోనా దృష్యా ఈ సారి పబ్లిక్ ప్లేసెస్‌లో విగ్రహాలు పెట్టడానికి అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. గణేష్ పూజా ఇంట్లోనే చేసుకోవాల‌ని సూచించారు. జాగ్రత్తలు పాటిస్తు మీఆరోగ్యాన్ని కాపాడుకోండి.. కరోనా నుండి మీకుటుంబాన్ని రక్షించండి అంటూ ట్వీట్ చేసిన ఆయ‌న‌ ఈసారి మొహరం, గణేష్ పండుగ‌ల‌ను ఇంట్లోనే జ‌రుపుకోవాల‌న్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతిలేదు. మీరు ఇంట్లోనే ఉండండి, హైదరాబాద్ నగరాన్ని ప్రశాంతంగా ఉంచండి అని పేర్కొన్నారు.

Related posts