telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

మంత్రోచ్చారణల మధ్య మహా చండీయాగం!

Woman candidates kcr cabinet Telangana
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సహస్ర మహా చండీయాగం వేదబ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య ప్రారంభమైంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో, జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి దంపతులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. గణపతి పూజ, గోపూజ, గురుపూజ, నవగ్రహ పూజ నిర్వహించి రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 
తెలంగాణాలో సకాలంలో వర్షాలు పడి, రైతులు సుభిక్షంగా ఉండేలా, ఇతర అభివృద్ది, సంక్షేమ పథకాలు నిరాఘాటంగా కొనసాగేలా, బంగారు తెలంగాణా కల సాకారం అయ్యేలా అమ్మవారి అనుగ్రహం కోసం సహస్ర హోమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని రుత్విక్కులు పూజలు చేశారు. రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని, దేశ పౌరులకు సుపరిపాలన అందాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. జనవరి 21 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు జరిగే ఈ యాగంలో300 మంది రుత్వికులు పాల్గొననున్నారు.

Related posts