వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు దేవినేని ఉమ, బచ్చుల అర్జునుడు పరామర్శించారు. అనంతరం దేవినేని ఉమ మాట్లాడారు.
ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. దురుద్దేశంతో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. భవిష్యత్తులో జగన్ తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు. రాజ్యాంగ విలువలు గాలికి వదిలేసి ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోందన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి నలంద కిషోర్ మరణానికి కారణమయ్యారని దుయ్యబట్టారు.
జగన్ గారు తెలుగులోనే కాదు ఇంగ్లీష్, లెక్కల్లోనూ వీకే: లోకేశ్