మరణంతో మరిచేదా ప్రేమంటే ..
దూరంతో ముగిసేదా ప్రేమంటే ..
నా అర్థ భాగానివి నీవయ్యావు..
మూడు ముళ్ళ బంధానికి
విలువనిచ్చావు..
ఏడడుగుల బంధానికి
అర్థం చూపించావు..
కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నావు..
మన ప్రేమకు గుర్తుగా ఇద్దరు
పిల్లను నాకు ఇచ్చావు..
కష్టాలు వున్నా ఆనందంగా
స్వీకరిస్తు..
చిరునవ్వును మాకందించావు..
ఇంటికి దీపమై వెలుగు నింపావు..
చివరకు మము వీడి నీవు
వెళ్ళి పోయావు..
-మాధవి గోపిశెట్టి,
హైదరాబాదు