మహిళలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ, అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి అన్నారు. మహిళల్లో మనోధైర్యం కల్పించి వారు ధైర్యంగా సమాజంలో తిరగగలిగే పరిస్థితులు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తన శాఖాపరమైన అన్ని విభాగాల ఇన్ చార్జిలతో నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహిళల్లో మనోధైర్యం కల్పించి వారు ధైర్యంగా సమాజంలో తిరగగలిగే పరిస్థితులు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తన శాఖాపరమైన అన్ని విభాగాల ఇన్ చార్జిలతో నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మహిళల భద్రతకోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. గృహహింస కేసులు రెట్టింపు అయ్యాయని, మహిళల మానసిక, సామాజిక భద్రత విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని వస్తున్న ఆరోపణలను ఆమె ప్రస్తావించారు.వన్‌స్టాప్ సెంటర్లు మరింత చురుకుగా వ్యవహరించాలని, మహిళలపై జరిగే అకృత్యాలపై తక్షణం స్పందించాలని ఆదేశించారు. మహిళలు ఎదుర్కొంటున్న ఒకే విధమైన సమస్యలపై స్పందించేందుకు దేశవ్యాప్తంగా కౌన్సెలర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అపోజిషన్ లో ఉండటం టీడీపీకి కొత్తేమి కాదు: చంద్రబాబు