ప్రధాని మోదీ పిలుపు మేరకు రేపు ‘జనతా కర్ఫ్యూ’ను ప్రజలందరూ పాటించాలని మెగాస్టార్ చిరంజీ అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి 24 గంటలు పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర బృందాలు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులను ప్రశంసించాల్సిన సమయమిదని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటిద్దామని చిరంజీవి అన్నారు. ఇళ్లకే పరిమితమవుదామని, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ మన గుమ్మాల్లోకి వచ్చి సేవలందిస్తున్న వారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిన సమయమిదని ఆయన వాఖ్యానించారు. భారతీయులుగా మనమందరం ఐకమత్యంతో ఒకటిగా నిలబడదామని పిలుపునిచ్చారు.
తిరుమల వీఐపీ దర్శనాలపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు!