జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ శ్రీలంకన్ బ్యూటీ ఇటీవల ప్రభాస్ ‘సాహో’ మూవీలో ‘బ్యాడ్ బాయ్’ సాంగ్‌లో ఆకట్టుకుంది. గ్లామర్ క్యారెక్టర్స్‌తో కిక్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మని బాలీవుడ్ బాబులు అరేబియన్ గుర్రం అని పిలుస్తుంటారు. కరోనా వైరస్ కారణంగా సెలబ్రిటీలెవరూ బయటకు రావడం లేదు. ఎవరి ఇంట్లో వాళ్లు వ్యాయామాలు చేసుకుంటున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన ఇంట్లో యోగాసనాలు చేయడం మొదలు పెట్టింది. బ్యాగ్రౌండ్లో మంచి మ్యూజిక్ వినిపిస్తుండగా రకరకాల భంగిమలు చేస్తూ నిపించింది.‘ఎప్పుడైనా ఎక్కడైనా యోగా నా ఫేవరెట్.. మంచి మ్యూజిక్ వింటూ యోగా చేయండి.. హెల్దీగా, హ్యాపీగా ఉండండి.. అంటూ యోగాసనాల వీడియోలు పోస్ట్ చేసింది. తన యోగాసనాలతో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

