తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ వేధిస్తున్నారని ప్రముఖ నటి, యాంకర్ అనసూయ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన పట్ల అసభ్యపదజాలం ఉపయోగిస్తున్నారని అనసూయ మండిపడుతోంది.
తాజాగా ఆమె స్పందిస్తూ, కొందరికి శిక్ష పడితేనే మిగతావాళ్లు ఇలాంటివి చేయడానికి భయపడతారని అభిప్రాయపడింది. ఇలాంటి పాడుపనులు చేయాలన్న ఆలోచన రావాలంటేనే భయపడేలా దండించాలని సూచించింది. ఎలాంటి చర్యలు తీసుకోకపోతే 10 మంది 100 మంది అవుతారని అన్నారు. అలాంటి వాళ్లే రేపు ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేసే క్రిమినల్స్ అవుతారని అనసూయ అభిప్రాయపడింది.
విశాల్ నన్ను పెళ్ళి చేసుకుంటానని అడిగారు… కానీ…!