telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి ప్రాంతంలో పవన్ పర్యటన!

pawan-kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 15న ఆ గ్రామాల్లో పర్యటించడానికి పార్టీ నేతలు షెడ్యూల్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత నెలలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా గాయపడిన వారు పవన్ ను కలిసి మరోసారి తమ గ్రామాల్లో పర్యటించవలసిందిగా కోరడంతో ఈ పర్యటనకు ఒప్పుకుని షెడ్యూల్ సిద్ధం చేయమని పార్టీ నేతలను పవన్ కోరారు.

పవన్ ఈ నెల 10వ తేదీనే అమరావతి గ్రామాల్లో పర్యటించాల్సి ఉండగా, సినిమా షూటింగ్ లు, కర్నూలు జిల్లాలో పర్యటన కారణంగా అది వాయిదా పడింది. పవన్ కర్నూలు జిల్లాలో ఈ నెల 12, 13 తేదీల్లో పర్యటించనున్నారు. అనంతరం ఒకరోజు విశ్రాంతి తీసుకుని 15న అమరావతి గ్రామాల్లో పర్యటిస్తారని సమాచారం.

Related posts