ఈనెల 11 నుంచి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్స్ విభాగంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు డైరె క్టర్, విభాగం హెడ్ డాక్టర్ మహ్మద్ అన్సారీ తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించనున్నఈ సదస్సును ఓయూ గెస్ట్‌హౌస్‌లోని ఐసీఎస్‌ఎస్‌ఆర్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహిస్తామని తెలిపారు.
సిస్టమిక్ ఫంక్షనల్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్(ఎస్‌ఎఫ్‌ఎల్‌టీఏ), రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ , ఉన్నత విద్యామండలి(టీఎస్‌సీహెచ్‌ఈ) తదితర సంస్థల సంయుక్త సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు వివరించారు. సదస్సుకు హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్రిస్టియన్ మాథ్యూ, ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్‌భట్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ప్రొఫెసర్ రోజ్ మేరీ, ప్రొఫెసర్ అనిబిలాలూసీ హాజరు కానున్నట్లు పేర్కొ న్నారు.
సమాజంలో మహిళల పట్ల చులకనభావం పోవాలి: కోదండరాం