telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బండి సంజయ్ లేఖకు స్పందించిన కేంద్రం

bandi samjay mp

కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవోపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్వయంగా వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ 203 పైన తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి బండి సంజయ్ లేఖ రాశారు.

బండి సంజయ్ లేఖకు కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశంపై పూర్తి వివరాలు, వాస్తవాలు తెలియజేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను షెకావత్ ఆదేశించారు. అంతేకాదు, ఈ అంశంలో ఏపీ ముందుకెళ్లకుండా ఆపాలని కేఆర్ఎంబీకి స్పష్టం చేశారు.

ఇది తెలంగాణ బీజేపీ శాఖ చేసిన ప్రయత్నానికి ఫలితంగా భావిస్తున్నామన్నారు. పోతిరెడ్డిపాడు నీటి సామర్ధ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసేలా కుట్రలు పన్నుతోందన్నారు. దీన్ని భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదని బండి సంజయ్ తెలిపారు.

Related posts