యంగ్ సెన్సేషనల్ హీరో ప్రస్తుతం విజయ్‌దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటిస్తున్నారు. క్రాంతిమాధవ్ దర్శకుడు. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లుక్‌లో కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ త్వరలో “ఫైటర్” మూవీ అనే సినిమా కూడా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కథానాయికగా నటించనుందని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం “ఫైటర్” నుండి జాన్వీ తప్పుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తనకున్న బిజీ షెడ్యూల్ వలన ఫైటర్‌కి డేట్స్ కేటాయించలేకపోతుందని అంటున్నారు. దీంతో “ఫైటర్” సినిమాలో కథానాయికగా కొత్త అమ్మాయిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట పూరి. ఫైటర్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉండగా, అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. మరి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు కన్పిస్తారో చూడాలి.
previous post
అమ్మాయి నచ్చితే ఫస్ట్ డేనే అడిగేస్తా… రామ్ గోపాల్ వర్మ సంచలన వర్మ