కొత్త సంత్సరానికి ఆహ్వనం పలికేందుకు బాలీవుడ్ భామ దిశా పటాని తనదైన స్టైల్‌నే ఎంచుకుంది. హాట్ ఇన్నర్‌వేర్‌తో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ `అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ భగవంతుడు అందరికీ ప్రేమను పంచాలని ఆశిస్తున్నా` అంటూ ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాల్విన్ కెయిన్‌కు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న ఈ బ్యూటీ తన ఇన్నర్‌వేర్ ఫోటో షూట్‌లతో చలి కాలంలోనూ వేడీ పుట్టిస్తుంది. సినిమాల పరంగా పెద్దగా అవకాశాలు లేకపోయినా తన సోషల్ మీడియా పోస్ట్‌లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తరువాత బాలీవుడ్ మూవీ ధోని బయోపిక్‌లోనూ హుందాగానే కనిపించింది. టైగర్ ష్రాఫ్ సరసన హీరోయిన్‌గా నటించిన భాగీ 2 సినిమాతో గ్లామర్ డోస్ పెంచేసిన దిశ, తరువాత బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ మలంగ్, కే టినా, రాధే సినిమాల్లో నటిస్తోంది.
⛄️❄️ happy new year to everyone, may god bless all with love💓 pic.twitter.com/1oDzH4VZx3
— Disha Patani (@DishPatani) December 31, 2019