telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

సీఎం రమేష్ ఇంట … మరో విషాదం.. సోదరుడి అకాలమృతి..

bjp mp cm ramesh brother died

బీజేపీ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సీఎం ప్రకాష్(51) మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. సీఎం ప్రకాష్ అకాల మరణంతో రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నేడు కడప జిల్లా పొట్లదుర్తిలో ప్రకాష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీఎం రమేష్ ఇంట ఈ ఒక్క సంవత్సరంలోనే రెండు విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో కుటుంబం ఆవేదనలో కూరుకుపోయింది. గతంలో ఆయన మేనల్లుడు ధర్మరామ్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు అపార్ట్మెంట్ ఏడో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Related posts