బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించింది. షారూక్ ఖాన్‌తో నటించిన “జీరో” తర్వాత ఇప్పటివరకు అనుష్క మరో సినిమాకు ఓకే చెప్పలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహానికి ముందు తన గ్లామరస్ ఫోటోలను, బికినీ ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసేది. కానీ వివాహం తర్వాత అందాల ఆరబోతకు దూరమైంది. ప్రస్తుతం సినిమాలకు కూడా దూరంగా ఉంది. పెళ్ళికి ముందు ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుంది. కేవలం గ్లామర్‌పరంగానే కాకుండా నటిగా కూడా మంచి మార్కులు వేయించుకుంది. మరి అనుష్క నటించిన సినిమాల్లో ఆమె భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏ సినిమా ఇష్టం? దానికి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ సమాధానం చెప్పాడు. “అనుష్క నటించిన సినిమాలన్నింటిలోనూ నాకు బాగా ఇష్టమైన సినిమా `ఏ దిల్ హై ముష్కిల్`. ఆ సినిమాలో అనుష్క పాత్ర నాకు చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా యూట్యూబ్‌లో ఆ సినిమా చూస్తుంటాను. అనుష్కకు క్యాన్సర్ అని తెలియడం, కొంతకాలం తర్వాత తిరిగి రణ్‌బీర్‌ను కలవడం, ఆ సమయంలో వినిపించే పాట నాకు చాలా ఇష్టం” అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
previous post
‘ఉప్పెన’ చిత్రంపై సేతుపతి కామెంట్స్ …