బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం అలియా ‘ఆర్ ఆర్ ఆర్’, ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’ సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో అలియా.. రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రామ్ చరణ్, అలియా భట్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తైందట. కాగా తాజాగా అలియా తన సోదరి గురించి చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. అలియా సోదరి షహీన్ ఒకప్పుడు తీవ్ర డిప్రెషన్‌తో బాధపడ్డారు. ట్రీట్మెంట్ తీసుకున్నాక కోలుకున్నారు. ఈ సందర్భంగా తాను డిప్రెషన్‌తో ఎలా పోరాడిందో వివరిస్తూ ‘ఐ హావ్ నెవర్ బీన్ హ్యాపీయర్’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఆదివారం ముంబయిలో ఆలియా భట్ లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో తన సోదరి డిప్రెషన్‌తో ఎలా బాధపడిందో వివరిస్తూ అలియా ఉద్వేగానికి లోనైంది. తానెప్పుడూ డిప్రెషన్‌తో బాధపడలేదు కానీ ఒకరకమైన ఆత్రుతకు గురయ్యేదాన్నని గత ఐదారు నెలలుగా ఎందుకో చాలా బాధాకరంగా అనిపిస్తోందని తెలిపారు. ఎట్టకేలకు తన సోదరి డిప్రెషన్ నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉందని, ఆమె రాసిన బుక్ చదివాక తాను ఎదుర్కొంటున్న సమస్య ఏంటో అర్థమైందని తెలిపారు. దాంతో పక్కనే ఉన్న షహీన్ తన సోదరిని ఓదార్చేందుకు ప్రయత్నించింది. అయినా ఆలియా కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆలియా ఏడుస్తున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
previous post
next post