సమంత, శర్వానంద్ హీరోహీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాణంలో తమిళ చిత్రం “96” తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళంలో “96” సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 96 సినిమాను దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరెకెక్కించారు. ఇదే సినిమాను తెలుగులో సమంత, శర్వానంద్లతో తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ చిత్రానికి తెలుగులో “జాను” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేసే అవకాశాలున్నాయని, ఆ దిశగా దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని సమాచారం.
previous post