telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నిన్న కుదరదు అన్న కోర్టు.. నేడు ప్రభుత్వ ఇష్టం అన్నదే.. కోర్టులను ప్రలోభపెట్టినట్టేనా.. ఇది ప్రభుత్వం పనేనా.. !

high court on new building in telangana

రాష్ట్ర ప్రభుత్వం 5100 బస్సులను ప్రైవేట్ రూట్లకు అప్పగిస్తామంటూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమంటూ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో రూట్ల ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ సర్కార్‌కు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయ్యింది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె పరిష్కారాన్ని లేబర్ కోర్టులో తేల్చుకోవాలంటూ హైకోర్టు విచారణను ముగించిన సంగతి తెలిసిందే. ఇక కోర్టు తీర్పును గౌరవించి కార్మికులందరూ కూడా తిరిగి విధుల్లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా చేర్చుకోవాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి.. ఆర్టీసీ అప్పుల ఊబిలో ఉందని.. మునపటి మాదిరి యధావిధిగా ఆర్టీసీని నడపడం అసాధ్యమని తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఈ క్రమంలో రూట్ల ప్రైవేటీకరణ అంశంపై తీర్పు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. ఈ తరుణంలో ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

మొదటి నుంచి ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారు. యూనియన్లు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తిరిగి విధుల్లోకి చేరాలంటూ ఆయన పలుమార్లు అవకాశం ఇచ్చారు. సీఎం అంతలా చెప్పినా కూడా కార్మికులు భేఖాతరు చేశారు. దీంతో ఆర్టీసీలో 50 శాతం బస్సులను ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కూడా కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేసీఆర్ కార్మికులపై విజయం సాధించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆర్టీసీ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.? కార్మికులను షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటారా.? లేక లేదా.? 5100 రూట్లను ప్రైవేటీకరణ చేస్తే.. కార్మికుల పరిస్థితి ఏంటి.? సమ్మె కాలంలో జీతాలు చెల్లించాలన్న యూనియన్ల వాదనకు కేసీఆర్ మాటేంటి.? చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఏ విధంగా సహాయపడతారు.? అనే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు వస్తాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related posts