ఆమె దేశానికే
తొలి చదువుల తల్లి!
బడుగు మహిళలకు
బడి బాటను
చూపిన కల్ప వల్లి!
చదువుల పూదోటలో
విర బూసిన సిరిమల్లి!
అంటరాని ఆకాశంలో
అర విరిసిన జాబిల్లి!
చాదస్తపు కాలాన్ని
ఎదిరించిన ధీర వనిత!
విద్యా ఫలాల్ని
పేదలకు పంచిన సమత!
అణగారిన వర్గాల చెంతకు
అక్షరాన్ని చేర్చిన వనిత!
కడగొట్టు బిడ్డలంటే
ఆమెకు ఎనలేని మమత!
కలం యోధురాలై
తిరగ రాసిన చరిత!
తరతరాలకూ
చెరగనిదమ్మా నీ ఘనత!!
(భారత తొలి మహిళా
ఉపాధ్యాయురాలు
సావిత్రీ బాయి పూలే
జయంతి సందర్భంగా..)
-వెన్నెల సత్యం,
షాద్నగర్.


“ఆయుష్మాన్ భవ”ను తెలంగాణలో అమలు చేయడం: ఎంపీ ధర్మపురి అరవింద్