105 రోజుల బిగ్ బాస్ నాగార్జున హోస్ట్‌గా 17 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో ఆదివారం నాడు విజేతను ప్రకటించారు. బిగ్‌బాస్ తెలుగు-3 టైటిల్‌ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ రూ.50లక్షల నగదు బహుమతిని దానితో పాటు ఓ ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌కు విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు మెగాస్టార్ చిరు టైటిల్‌ను అందజేశారు. అయితే తాను గెలవడానికి వైఎస్ జగన్ కూడా ముఖ్యమని చెప్పాడు ఈ కుర్ర సింగర్. ఇక ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత రాహుల్ కూడా తన ప్లస్ మైనస్‌ల గురించి చెప్పుకొచ్చాడు. బయట తాను ఎలా ఉన్నానో, ఇంట్లో కూడా తాను అలాగే ఉన్నానని.. అదే ప్రేక్షకులకు నచ్చి గెలిపించి ఉంటారని చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్. అయితే తన గెలుపుకు ప్రధాన కారణం వైఎస్ జగన్ కూడా అయ్యుంటాడని తనకు సన్నిహితులు చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు రాహుల్. ఎన్నికలకు ముందు తాను కంపోజ్ చేసి జగన్మోహన్ రెడ్డిపై ఓ పాట పాడాడు రాహుల్. అది అప్పట్లో వైరల్ అయింది. అదే ఇప్పుడు గుర్తు పెట్టుకుని జగన్ ఫ్యాన్స్ అంతా గుంపగుత్తగా రాహుల్‌కు ఓటేసి ఉంటారని ఇండస్ట్రీలో కూడా చర్చ మొదలైంది. దానికితోడు యూ ట్యూబ్ ఫాలోయర్స్ 5 లక్షలకు పైగానే ఉండటం.. అతడి పాటలకు 10 కోట్లకు పైగా వ్యూస్ ఉండటం ఇవన్నీ రాహుల్ గెలుపులో కీలకపాత్ర పోషించాయి. ముఖ్యంగా అయితే జగన్ పాట కీ రోల్ ప్లే చేసిందని చెప్పుకొచ్చాడు రాహుల్.
Thanks for the song on our Leader @Rahulsipligunj bhai 👏
All the best for your future !! 🔥Just rock with your voice pic.twitter.com/j5YtwM4ZDZ
— Manvitha Chinnu (@ManviDad) November 6, 2019