“నిను వీడని నీడను నేనే” చిత్రంతో సూపర్‌హిట్ సాధించిన యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం “A1 ఎక్స్‌ప్రెస్”. సోమవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మురళీశర్మ, రఘుబాబు, సందీప్ కిషన్లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న తొలి తెలుగు చిత్రమిది. అలాగే ఈ జోనర్లో సందీప్ కిషన్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
All the very best to our @sundeepkishan , @AbhishekOfficl and @vivekkuchibotla for the shoot of A1 Express. It should be as best as venkatadri express and shd be a rajadhani express for sundeep’s career. Wishing 3 banners fly at express speed. pic.twitter.com/NMVKsZ8fFj
— Anil Sunkara (@AnilSunkara1) November 4, 2019