telugu navyamedia
సినిమా వార్తలు

బ్యాక్ లుక్ లో వ‌రుణ్ వ‌ర్క‌వుట్స్‌!

సినిమాలు కోసం హీరోలు పడే కష్టాలు అంతా ఇంతా కాదు. త‌మ బాడీల‌ను ఫిట్ గా క‌నిపించ‌డం కోసం భోజ‌నాలు మానేసి జిమ్‌లోనే కాలం కాడిపేస్తుంటారు. మ‌రీ ముఖ్యంగా.. యాక్షన్స్ థ్రిల్లర్ చూసే ప్రేక్షకులను మెప్పించ‌డానికి సినిమాలోని వేషానికి తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవడం కోసం హీరోలు ఎంతో పట్టుదలతో శ్రమిస్తుంటారు.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ అదే ప‌ని ఉన్నాడు. ‘గనీ’ చిత్రంలో బాక్సర్ గా కనిపించబోతోన్న ఆయన జిమ్ లో కండల్ని చెమటలతో మెరిపిస్తున్నాడు. కఠోరమైన వ్యాయామాలు చేస్తూ రాటుదేలుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం వరుణ్ ఎక్కువగానే కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ హీరో.. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చేశాడు.

తాజాగా వరుణ్ తేజ్ గనీ సినిమా జిమ్‏లో వర్కవుట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖం చూపించకుండా బ్యాక్ లుక్ లో తీసిన ఈ వీడియోలో వ‌రుణ్ పుల్ అప్స్ చేస్తూ క‌నిపిస్తున్నాడు. హార్డ్ వ‌ర్క్ కు బ్యాక్ అప్ లుండ‌వు అంటూ వీడియోకు క్యాప్షన్స్ ఇచ్చాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

Related posts