హైకోర్టు తరలింపుపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని రాయలసీమ ప్రాంత న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో న్యాయవాదులు ఈరోజు సచివాలయానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తుండగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. హైకోర్టును రాయలసీమకు తరలించాలనే ప్లకార్డులను ప్రదర్శించారు.ఈ సందర్భంగా రాయలసీమ ప్రాంత అడ్వొకేట్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలంటే హైకోర్టును రాయలసీమకు తరలించాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు కోస్తాలోనే ఉండాలని ఆ ప్రాంత న్యాయవాదులు కోరితే… రాజధానిని రాయలసీమకు తరలించాలని అన్నారు. శ్రీభాగ్ ఒప్పందం మేరకు హైకోర్టును సీమకు తరలించాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలివ్వడం, అధికారంలోకి రాగానే హామీలను పట్టించుకోకపోవడం రాజకీయ పార్టీలకు అలవాటైపోయిందని విమర్శించారు.
తెలంగాణలో నడ్డా మాటలు కార్యరూపం దాల్చలేదు: పొన్నం ప్రభాకర్