దక్షిణ కొరియాలోని సియోల్‌లో 25 ఏళ్ల కే-పాప్‌స్టార్ సులీ తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మృతురాలి మేనేజర్ ఈ సంగతిని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఆమె మృతికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. గతంలో బ్యాండ్ ఎఫ్ సభ్యురాలిగా ఉన్నసులీ అసలు పేరు చోయీ జిన్-రీ. ఆమెకు ఇన్ స్టాగ్రామ్‌లో 50 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె యాక్టింగ్ కెరియర్ మీద దృష్టిసారిస్తూ, 2015లో బ్యాండ్‌ను విడిచిపెట్టారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సులీ తనపై సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతరకరమైన కామెంట్లకు తీవ్ర కలత చెందారు. దీంతో ఆమె కెరియర్ను పక్కనపెట్టేశారు. ఈ నేపధ్యంలోనే సులీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సులీకి కే-పాప్ స్టార్ జోంఘ్యున్ (27) మంచి స్నేహితుడు. 2017లో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.