ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పై ఆయన సమీప బంధువు కంచేటి సాయి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కోడెల కుమారుడు శివరామే ఆస్తికోసం ఈ హత్య చేశాడని ఆయన ఆరోపించారు. శివారామ్ తనను శారీరకంగా, మానసికంగా చాలాకాలం నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని శివప్రసాద్ తనతో అనేకసార్లు చెప్పినట్లు సాయి తెలిపారు.
శివరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని నన్ను వేడుకున్నారని తెలిపారు. ఆయనకు ఆత్మహత్య చేసుకునే అవసరం, బాధలేదని శివరామే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈరోజు ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.